హిందువులు పూజించే ఆవు నుంచి వచ్చే నెయ్యితో ఎన్నో ఆరోగ్యకరమయిన లాభాలు ఉన్నాయి, ఆవు నెయ్యి ఎంతో శ్రేష్ఠ మయినది. నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దేశీ ఆవు నెయ్యి అన్నింటి కంటే చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఏజెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. తరచుగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించేవారికి దేశీ ఆవు నెయ్యి(Desi Ghee) అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యి తీసుకోవడం వల్ల ఊబకాయం, కొవ్వు పెరుగుతుందని కొందరు అనుకుంటారు. డైట్ కాన్షియస్ ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ఆహారంలో దేశీ నెయ్యిని తినరు, కానీ వాస్తవం దీనికి కొంత భిన్నంగా ఉంటుంది. అవును , దేశీ నెయ్యి తినడం వల్ల మీ బరువు లేదా కొవ్వు పెరగదు. కానీ దానిని తినడం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవును.. దేశీ ఆవు నెయ్యికి ఆయుర్వేదంలో సూపర్ ఫుడ్ హోదా ఇచ్చింది. ప్రజలు తరచుగా నెయ్యికి బదులుగా శుద్ధి చేసిన నూనెను వినియోగించే విధానం నిజంగా ఆరోగ్యానికి హానికరం(Desi Ghee benefits)…ప్రతి రోజూ ఉదయం పరగడపున నెయ్యి తీసుకోవడం జీర్ణవ్యవస్థ పనితీరు మెరగవుతుంది. గట్ ఆరోగ్యాన్ని నెయ్యి మెరుగుపరుస్తుంది. మలబద్ధకం లక్షణాలు తగ్గించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నెయ్యిలో ఉంటే ఫ్యాట్స్ మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది. పిల్లల జ్ఞాపక శక్తి పెంపొందించడంలో నెయ్యి కీలక పాత్ర పోషిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రోజూ నెయ్యి తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు మెరుగుపడుతుంది. ఎముకలు ధృఢంగా మారుతాయి. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు నెయ్యి తీసుకోవడం వల్ల లభిస్తాయి.
షుగర్ ఉన్నవాళ్లు ఆవునెయ్యి అస్సలు వాడకూడదు…..
రక్తంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నవారు నెయ్యి మితంగా వాడాలి. డయాబెటిస్ సమస్యలు ఉన్నవారు నెయ్యికి దూరంగా ఉంటేనే మంచిది. నెయ్యిలో ఉంటే కొవ్వుల వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదముంది. ఒకవేళ నెయ్యి తీసుకోవాలనుకుంటే డాక్టర్‌ని సంప్రదించి తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.
కొందరికి మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉంటుంది. పాలకు సంబంధిత పదార్థాలు తీసుకుంటే వీరికి రియాక్షన్ ఉంటుంది. చర్మంపై మంట, దద్దుర్లు, వాపు వంటి సమస్యలు ఎదుర్కోంటారు. అందుకే నెయ్యి వీరికి పడకపోవచ్చు. నెయ్యిలో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల వీరికి అలర్జీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
గర్బీణి మహిళలు కూడా ఎక్కువగా నెయ్యి తీసుకోకూడదు. నెయ్యిలో ఉండే రెటినాల్ టాక్సిసిటీ కారణంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఆరోగ్యంపై ప్రభావం పడచ్చు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు నెయ్యిని మితంగా తీసుకుంటేనే ఉత్తమం. ఎందుకంటే.. నెయ్యిలో ఉండే కొవ్వులు అధిక కొలెస్ట్రాల్‌కి కారణమవుతాయి. దీంతో.. గుండె సమస్యలు తీవ్రమవుతాయి. రక్తం గట్టకట్టే వ్యాధితో బాధపడుతున్నవారు మందులు తీసుకుంటారు. ఈ మెడిసిన్ తీసుకునేవారు నెయ్యికి దూరంగా ఉండాలి. మందులో నెయ్యి రియాక్షన్ జరిపే అవకాశం ఉంది.