కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎం జరిగిందో చూద్దాం. దీప, కార్తీక్ జ్యోత్స్న లను తన ఇంట్లో పూజ ఏర్పాటు చేసి పిలుద్దామని అనుకుంటుంది, సౌర్య కార్తీక్ మేనత్త తో, హాయ్ అమ్మమ్మ రేపు మా ఇంట్లో పూజ అంటుంది, అప్పుడు ఆమె రేపు పూజ మీ ఇంట్లో కాదు మా ఇంట్లో అంటుంది. జ్యోత్స్న పార్వతి లు ఇదంతా విని జ్యోత్న ఏంటి గ్రానీ మా అమ్మ న పెళ్లి గురుంచి ఆలోచించకుండా ఆ దీప పూజ గురుంచి ఆలోచిస్తుంది దీపని తన కూతురు లాంటిది అంటుంది, ఈ పూజ వెనకాల ఎదో ఉంది అని అనుకుంటారు ఇద్దరు.
దీప అత్తగారు దీప తో నువ్వు చెయ్యలకున్నది మంచిదే కానీ, కార్తీక్ ని చూస్తుంటేనే ఆ పెద్దాయన మండి పడుతున్నాడు, కార్తీక్ బాబు వాళ్ళు ఈ పూజ కి వస్తాం అనడమే ఎక్కువ, కార్తీక్ బాబు వాళ్ళను వీళ్ళు చూస్తే మల్లి అగ్గి రాజేసినట్టు అవుతుంది అంటుంది దీప తో. అప్పుడు దీప ఇది చల్లారే గొడవ కాదు అత్తయ్య, రోజురోజు కి వాళ్ళ మధ్య దూరం పెరుగుతుంది, పూజ పేరుతో మన ఇంట్లో వీళ్ళను కలుపుదాం అనుకుంటే సుమిత్ర గారు వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు, మనం ఒకటి అనుకుంటే అమ్మవారు సంకల్పం ఇలా ఉంది అలాగని సుమిత్రమ్మ గారికి అసలు నిజం చెప్పలేకపోయాను, ఈ రెండు కుటుంబాలను కలపడం నా బాధ్యత, కార్తీక్ జ్యోత్స్న లను కలపడం న లక్ష్యం, ఎందుకో తెల్సా అత్తయ్య, కార్తీక్ బాబు నన్ను కాపాడానికి రాకపోతే ఈ పాటికి వాళ్ళ పెళ్లి జరిగేది, ఆ తర్వాత శ్రీధర్ గారి రెండో పెళ్లి గురుంచి తెల్సిన, జరిగిపోయిన రెండో పెళ్లి వద్దు అనలేరు కదా, వీలయినంత త్వరగా కార్తీక్ జ్యోత్స్న లను కలపాలి, ఇది జరగడం కోసం ఎన్ని అవమానాలయిన పడతాను అంటుంది దీప. ఒక పక్క నర్సింహా పోలీస్ లకు దొరక్కుండా తిరుగుతున్నాడు మనం ఇక్కడే ఉంటె మనకు చాల ప్రమాదం వీలయినంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటుంది దీప అత్తయ్య తో.
పూజ కోసం అంత సిద్ధం చేసారు, పెద్దాయన కనిపించడం లేదేంటి అని దీపా అత్తగారు అంటుంది, అప్పుడు దీప సుమిత్రని అడుగుదామని వెళ్తుంది, దీప సుమిత్ర తో అమ్మ ఇంట్లో తాతయ్యగారు వాళ్ళు కనిపించడం లేదేంటి ఇంట్లో, పూజ కి తాతయ్యగారు రాకపోవచ్చు అంటుంది సుమిత్ర. సుమిత్ర సౌర్య ని అమ్మవారిలా తాయారు చేస్తుంది అప్పుడు నగలు వేస్తుండగా అప్పుడు దీప నగలు వెయ్యద్దు అంటుంది. అప్పుడే జ్యోత్స్న పార్వతి అక్కడికి వస్తారు జ్యోత్స్న మా అమ్మ కి నా గురుంచి అవసరం లేదు గాని, వేరే వాళ్ళ పూజ గురుంచి అవసరం అంటుంది. ఈ లోగ కార్తీక్ వాళ్ళు వస్తారు దీప అత్తగారు దీప ని పిలిచి చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ గురుంచి వీళ్లకు ఏమని చెప్పాలో అనుకుంటూ, దీప కార్తీక్ వాళ్ళతో లోపలికి తీసుకురావాదానికి దీప వెళ్తుంది. పూజ ఈ ఇంట్లో అంటుంది దీప, అప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మ అబద్దం చెప్పి పిలిపించావా దీప అంటుంది, అప్పుడు దీప క్షమించండి అమ్మ.. సుమిత్ర గారు పూజ వాళ్ళ ఇంట్లో పెట్టారు అంటుంది. అప్పుడు కార్తీక్ మరి ఆ ముక్క ముందే చెప్పుంటే ఆగి పోయేవాళ్ళం కదా అంటాడు. అప్పుడు దీప అక్కడయినా పూజ చేసుకునేది నేనే కదా బాబు అంటుంది, అప్పుడు కార్తీక్ తెలివిగా మాట్లాడకు, నువ్వు ఆ ఇంటికి దగ్గరదానివి మెం కాదు అంటాడు, అప్పుడు దీప లేదు కార్తీక్ బాబు మీరు ఎప్పటికయినా కలవాల్సిన వాళ్ళు నేనే పరాయి దాన్ని రండి బాబు అంటుంది కార్తీక్ ని. అప్పుడు కార్తీక్ రాలేను దీప, మా తాతయ్య గుమ్మం లో ఎలా అడుగుపెడతావ్ అని అడుగుతాడు, ఏం సమాధానం చెప్పాలి అంటాడు. అప్పుడు దీప మీ తాతయ్య గారు మావయ్యగారు ఇంట్లో లేరు బయటకు వెళ్లారు అంది. అప్పుడు కార్తీక్ అంటే ముందే అన్ని ప్లేన్ చేసుకున్నావ్ అంటాడు, అప్పుడు దీప లేదు కార్తీక్ బాబు మీరు వస్తారని వాళ్లకు తెలీదు నా కోసం ఈ పూజ కి రండి అంటుంది, అప్పుడు కార్తీక్ తల్లి లేదు దీప మా నాన్న అన్నయ్య ఇంట్లో లేకపోయినా నేను రాను అంటుంది, కార్తీక్ కూడా మమ్మల్ని ఏం మొహం పెట్టుకుని రమ్మంటావ్ దీప అంటాడు, మిమ్మల్ని రావద్దు అనేవాళ్ళు ఎవరు లేరు అమ్మ, మీ కోసం మీ వదినగారు కూడా ఎదురుచూస్తున్నారు , నా కోసం నా మనుషులుగా రండి అమ్మ అని అంటుంది దీప. కార్తీక్ వాళ్ళ అమ్మ ఇద్దరు లోపలి వెళ్తుండగా సౌర్య వచ్చి ర కార్తీక్ మీ కోసమే ఎదురుచూస్తున్న రా కార్తీక్ అంటూ లోపలి తీసుకెళ్తుంది సౌర్య.
దీప సుమిత్ర దగ్గరకి వచ్చి, అమ్మ నేను నాకు తెల్సిన వాళ్ళను పూజ కి పిలిచాను మీకేం అభ్యన్తరం లేదు కదా అంటుంది. అప్పుడు పార్వతి మా ఇంట్లో నువ్ పూజ చేసుకోవడమే ఎక్కువ అనుకుంటే మల్లి నీ బంధువులను కూడా పిలిచావా ఇంతకు ఎవరమ్మా ఆ బంధువులు అంటుంది, అప్పుడు దీప రండమ్మా అంటుంది, కార్తీక్ వాళ్ళ అమ్మ ఇద్దరు లోపాలకి వస్తారు సుమిత్ర వాళ్ళను చూసి వదిన అంటూ కార్తీక్ తల్లి ని పట్టుకుని ఏడుస్తుంది. పూజ చేస్కుంటున్నా అని పిలిస్తే దీప మాట కాదనలేక వచ్చాను, రాకూడదు అనుకున్న కానీ తప్పు చేసిన మనిషిలా ఎన్నాళ్ళు ఉంటా, ఏదొక రోజు ఎదురుపడాల్సిందే గా అంటూ వచ్చా అంటుంది కార్తీక్ తల్లి, అయినా అన్నయ్య నాన్న మమ్మల్ని వద్దనుకున్నారు కానీ మేం వద్దు అనుకోలేదు గా అంటుంది. హాల్ లో ఫామిలీ ఫోటో ఉండాలిగా, నాన్న తీసి విసిరేసాడా? మా ఫొటోలకే ఇంట్లో చోటు లేకపోతే ఇంకా మనుషులకి ఎం ఉంటుంది వదిన మెం ఇప్పుడు దీప మనుషులు గానే వచ్చాము అలానే చూడండి అంటుంది. అప్పుడు జ్యోత్స్న దీప పిలిస్తే వస్తే దీప మనుషులు అయిపోతారా, నువ్వు ఎప్పటికి ఈ ఇంటి ఆడపడుచువే అత్త, కానీ నిన్ను ఈ రోజు ఇలా పిలిచినందుకు దీప కి థాంక్స్ చెప్పాల్సిందే అంటుంది, థాంక్స్ దీప మెం చెయ్యలేని పని నువ్ చేసావ్ అంటూ దీప ని మెచ్చుకుని పూజ మొదలు పెడతారు.
జ్యోత్స్న తండ్రి తాతయ్యలు తనకి పెళ్లి సంబంధం చూసి కార్ లో ఇంటికి తిరిగి వస్తుంటారు.