కార్తీక దీపం Serial Today Episode(13/12/2024)

దీప ని కిడ్నప్ చేసిన రౌడీ లు, దీప ని ఎవరు రక్షిస్తారు…?

కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం, సౌర్య కళ్ళు తిరిగి స్కూల్ లో పడిపోయింది అని ఫోన్ రాగానే ఏమాత్రం ఆలోచించకుండా భయం తో ఇంటి నుండి బయల్దేరుతుంది, బయటకు రాగానే అప్పిటికే అక్కడ రౌడీ దీప కోసం ప్లేన్ వేసి ఆటో తో రెడీ గా ఉన్నాడు, అప్పుడు దీప అదే ఆటో ఎక్కి అన్న మార్కెట్ పక్కన ఉన్న స్కూల్ కి తొందరగా పోనివ్వండి అంటుంది, దీప ని చూసి ఆ రౌడీ మనసులో ఈవిడ చూడటానికే చాలా అమాయకురాలు లా ఉంది, మేడం ఈవిడని చంపమని చెప్పరేన్తి అని అణుకుతుంటాడు, దీప ని ఆటో ఎక్కించుకుని బయల్దేరతాడు, దీప భయం తో తొందరగా పోనివ్వండి అన్న అని అంటూ ఉంటుంది, ఈ లోగ ఆటో వేరే రూట్ లో వెళ్లడం చూసి స్కూల్ ఇటు కాదు కదా అన్న అంటుంది, అప్పుడు ఆ డ్రైవర్ మీరే కదా తొందరగా పోనివ్వమన్నారు, ఇటు షార్ట్ కట్ అని ఒక తోట లోకి తీస్కుని వెళ్లి దిగండి అంటాడు, అప్పుడు ఏంటి ఎక్కడికి తీసుకొచ్చారు అన్న అని అంటుంది, అప్పుడు ఆ రౌడీ ఒక విసుల్ వేసి మిగిలిన రౌడీ లని పిలుస్తాడు, ఇంకా రౌడీలు అంత దీప ని చుట్టుముడతారు.

దీప ని ఆ రౌడీలు చుట్టి ముట్టారు, అయినా దీప ఏ మాత్రం భయపడ కుండా అక్కడే ఉన్న ఒక పెద్ద కట్టెను తీసుకుంటుంది, ఈ గొడవ అంత జ్యోత్స్నా పారిజాతం లు దూరం గా కార్ లో ఉంది గమనిస్తూ ఉంటారు, ఈ రోజు ఈ దీపని కాపాడటం ఎవరి వాళ్ళ కాదు అని అనుకుంటూ ఉంటారు, ఈ లోగ దీప ఆ కట్టెను పట్టుకుని అందరిని కొట్టడం మొదలు పెడుతుంది, ఒక వీర వనితలాగా కోపం తో అందరినీ చితక బాదుతుంది, అది చూసి జ్యోత్స్నా పారిజాతం షాక్ అవుతారు, దీప చంపించేద్దామని ప్లాన్ వేస్తే, తనే అందర్నీ చితక బాదుతుంది ఏంటి అని షాక్ అవుతారు. వాళ్ళందర్నీ బాదుతూ ఎవర్రా మీరంతా ఎవరు, ఎందుకు నన్ను చేపలను కుంటున్నారు అని చితక బాదుతుంది. 

కార్తీక్ దీప ఎక్కడుందో కనిపెడతాడా…?

కార్తీక్ దీప కోసం ఇంట్లో పిలుస్తూ ఉంటాడు, ఈ లోగ అనసూయ లేదు బాబు, సౌర్య పడిపోయింది అని స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది, అందుకే కంగారు గా వెళ్ళింది అంటుంది, అప్పుడు కార్తీక్ అదేంటి నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళింది అంటాడు, అప్పుడు కాంచన స్కూల్ లో ఏమైనా జరిగితే నీకు కదా ఫోన్ చేస్తారు దీప కి ఎందుకు చేస్తారు నాకేదో భయం గా ఉంది అంటుంది, అప్పుడు కార్తీక్ కి కూడా డౌట్ వచ్చి దీప ని వెతుకుంటూ వెళ్తుంటాడు.

దీప మీదకి కత్తితో వెళ్లిన రౌడీ…రౌడీ లా పే ఆది పరాశక్తిలా విరుచుకు పడిన దీప…

ఈ లోగ ఆ రౌడీ లు దీప ని కత్తితో పొడవటానికి వెనక నుండి ఒకడు వచ్చి పొడవ బోతాడు, ఈ లోపే కార్తీక్ వచ్చి ఆ రౌడీ ని కొడతాడు, అప్పుడు జ్యోత్స్న పారిజాతం లు కార్తీక్ ని చూసి షాక్ అవుతారు, ఇంకా కార్తీక్ దీప ఇద్దరు కలిసి ఆ రౌడీలు అందరిని కొడుతూనే ఉంటారు, ఎవరు మిమ్మల్ని పంపించింది అంటూ అడుగుతారు, అప్పుడు కార్తీక్ కళ్ళలోకి ఇసుకని వేసి అక్కడి నుచ్న్హి అందరు పారి పోతారు, జ్యోత్స్న పారిజాతం కూడా ఇక్కడే ఉంటె కార్తీక్ కి తెలిస్తే చంపేస్తాడని బయపడి వెళ్ళిపోతారు, ఇంకా దీప కార్తీక్ లు ఎవరు ఈ పని చేసుంటారు అని అనుకుంటూ ఇంటికి వెళ్తారు.  కాంచన అనసూయలు కూడా అంత అవసరం ఎవరికీ ఉంది ఉంటుంది, నరసింహ చేసుంటాడ, దీప ని చంపేంత అవసరం వాడికి తప్ప ఇంకెవ్వరికి ఉంటుంది అనుకుంటారు.

దీప మీద ఎటాక్ చేయించింది మీరే అని పారిజాతం కి ఫోన్ చేసిన కార్తీక్….

జ్యోత్స్నా పారిజాతం లు జరిగిన దానికి షాక్ అయ్యి జ్యోత్స్నా  అంటుంది, దీప కి కోపం వస్తే ఆడవాళ్ళని అనుకున్నాను, మగవాళ్ళని కూడా ఇలా కొట్టేసిందని ఇద్దరు అనుకుంటూ ఉంటారు, ఈ లోగ కార్తీక్ అంత అవసరం ఎవరికీ వచుంటుందా అని ఆలోచిస్తుండగా, ఒకసారి జ్యోత్స్నా హాస్పిటల్ దగ్గర కార్ ని చెట్టుకు గుద్దుకున్న విష్యం గుర్తుకు వస్తుంది, అదే డౌట్ తో పారి జాతం కి ఫోన్ చేస్తాడు, నిజం తెల్సిందంతావా అని ఇద్దరు భయపడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది పారిజాతం, అప్పుడు కార్తీక్ ఏంటి గ్రానీ ఎలా ఉన్నావ్ అంటాడు, అప్పుడు పారిజాతం నాకేం బానే ఉన్నాను అంటుంది, అప్పుడు కార్తీక్ మారేందుకు ఫోన్ లిఫ్ట్ చెయ్యడానికి ఇంత టైం పట్టింది, అంత కంగారు గా మాట్లాడుతున్నావ్, తప్పు చేసినవాళ్ళే భయపడతారు గ్రానీ అంటాడు, అప్పుడు పారిజాతం నాకేంటి భయం నేనేం చేసాను అంటుంది, అప్పుడు కార్తీక్ నా భార్య మీద ఎటాక్ జరిగింది ఎందుకు ఆలా చేశారు, మీరే ఇలా చేశారు అంటాడు, నా భార్య ని ఇలా చేసే అవసరం ఆ జైలు లో ఉన్న వాడ్నీకి లేదా నీ పక్కన ఉన్న నీ మనవరాలికి ఉంటుంది అంటాడు, అప్పుడు పారిజాతం రివర్స్ లో ఏం మాట్లాడుతున్నావ్ రా, మాకు అంత ఎం వసరం ఉంటుంది, దాన్ని చంపడం వాళ్ళ మాకు బూడిద వస్తుందా, అయినా దాన్ని చంపాలని చూసింది ఆ నరసింహ గాడికి ఉంటుంది ,లేదా వాడి రెండో పెళ్ళానికి ఉంటుంది, దీప గతాన్ని తవ్వుకుంటూ పోతే ఎవరో నీకే తెలుస్తుంది అంటుంది పారిజాతం.

Scroll to Top