కార్తీక దీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం. పార్వతి బంటు లు దీప గురుంచి పేర్మినెంట్ గ వెళ్ళిపోతుంది అనుకుంటే మల్లి అత్తగారిని కూడా తీసుకుతెచ్చుకుంది అంటుంది పార్వతి, అప్పుడు బంటు వీళ్ళ ని చూస్తుంటే పేర్మినెంట్ గ ఇక్కడే ఉంది పోయేలా ఉన్నారు అమ్మ అంటదు, అప్పుడు పార్వతి, వాళ్ళు ఇక్కడే ఉంటె మనం బయటకు వెళ్లాల్సి వస్తుంది అని ఇద్దరు అనుకుంటూ ఉండగా, ఇంతలో ఇంటి ముందు ఆటో ఆగుతుంది, అప్పుడు పార్వతి ఏంట్రా ఇది, ది గ్రేట్ పార్వతి పాలస్ ముందు చీప్ గా ఆటో వచ్చి అగడమా అంటుంది, ఈ లోగ ఆ ఆటో నుంచి జ్యోత్స్న దిగుతుంది, బంటు చూసి పార్వతి తో చెప్తాడు, అప్పుడు పార్వతి జ్యోత్స్న ని ఏం అయింది నువ్వు ఆటో లో రావడం ఏంటి అని అడుగుతుంది, కార్తీక్ హోటల్ లో టీ తాగుతూ బిజీ గా ఉన్నాడు అంటుంది, అప్పుడు పార్వతి అదేంటి హోటల్ లో టీ తాగడం ఏంటి అంటుంది, అప్పుడు జ్యోత్స్న ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో, ఎందుకు ఉంటారో నాకేం తెల్సు వెళ్లి అడుగు అంటుంది జ్యోత్స్న, అంతాఎవరు ఇష్టం వాచినట్టు వాళ్ళు చేస్తున్నారు నాకంటూ ఒక వేల్యూ ఉంటుంది అంటుంది, నోటితో అనకుండా బుడ్డి వచ్చేలా చేసాడు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. కార్ లో దీప, కార్తీక్ ళ్లు వస్తుండగా కార్తీక్ సడన్ గా కార్ అపి దీప ఒకసారి కార్ దిగండి మీతో మాట్లాడాలి అంటాడు, అప్పుడు దీప సరే నేను నడిచి వెళ్ళిపోతే అంటూ కార్ దిగుతుంది, అప్పుడు కార్తీక్ దీప అసలు దేని గురుంచో అడగ కుండా ఆలా వెళ్ళిపోతావ్ ఏంటి అంటాడు, అప్పుడు దీప మన గురుంచి నా అనుకున్న వాళ్ళు మాట్లాడితే మన మంచి గురుంచి అయి ఉంటుంది, అప్పుడు కార్తీక్ మీ అనుకున్న వాళ్ళ లిస్ట్ లో నన్ను కూడా చేర్చుకోండి, లేకపోయినా పర్లేదు నేను చెప్తాను అంటాడు కార్తీక్. దీప నేను వినకూడదు అనుకున్న విషయాన్ని నేను విఞ్ఞు అంటుంది, అప్పుడు కార్తీక్ నేను ఆ విష్యం గురుంచి మర్చిపోండి నేను సుమిత్ర మేన అల్లుడు గా మాత్రమే చుడండి మీ శ్రేయాభిలాష గా చుడండి అంటాడు కార్తీక్. నేను మాట్లాడేది సూర్య గురుంచి అంటాడు కార్తీక్, మీ భయం ఏంటి నేను తన తండ్రి గురుంచి చెప్తా అనే గా భయం, మీరు చెప్పకుండా నేను అయితే చెప్పను అంటాడు కార్తీక్, అప్పుడు దీప మీరు మాట మీద నిలబడే మనిషి కాదు బాబు అంటుంది కార్తీక్ తో, దానికి బట్టలు కొనద్దు అన్నాను కొన్నారు, మేము కనిపించి నట్టు ఇంట్లో చెప్పొద్దూ అన్నాను చెప్పారు మీరు మాట మీద నిలబడతారు అని ఇంకేం ఉంది అంటుంది దీప, అపుడు కార్తీక్ ఒకటి ఇష్టం తో జరిగింది, రెండోది అవసరం తో జరిగింది, ఇది ఆలా జరగదు లెండి అంటాడు, అప్పుడు దీప మీరు నాతో మాట్లాడాలనుకుందేమి ఇదేనా అంటుంది దీప కార్తీక్ తో. అప్పుడు కార్తీక్ మీరు మీ అత్తయ్య గారితో బయటకు వెళ్లారని సూర్య చెప్పింది, ఆవిడా ఏరి అంటాడు కార్తీక్. ఈ లోగ వాళ్ళ ఇద్దర్ని చూసి కార్ లో వెళ్తున్న నరసింహ,తన తల్లి , శోభా కార్ ని ఆపుతారు , వాళ్ళ ఇద్దర్ని చూస్తారు అప్పుడు నరసింహ వాళ్ళ అమ్మ తో నేను చెపితే వినలేదు కదా అమ్మ ఇప్పుడు చూడు అది వేసే వేషాలు అంటాడు, అప్పుడు ఆవిడా ఊర్లో నంగనాచి లాగా ఉంటూ ఇక్కడికి వచ్చి ఇలా చేస్తున్న ఉండు దాని పని చెప్తాను అంటుండగా, నర్సి ఆగు అమ్మ అంటాడు, అప్పుడు నష్టం మనకే, నీ ముందు నా గురుంచే అబద్దం చెప్పిన దానికి ఇంకో కదా అల్లడం కష్టమేం కాదు అమ్మ, అయినా దాన్ని ఏమైనా అంటే వాడు ఊరుకోదు కదా అంటాడు, వడితి ఎక్కడికి పడితే అక్కడికి తిరుగుతుంది అంటాడు దీప గురుంచి, దీప కార్తీక్ లు మాట్లాడుకుంటున్న మాటలను ఊహిన్చుకుని , వాళ్ళ అమ్మ తో వేరుగా మార్చి చెప్తాడు నరసింహ, దానికి సపోర్ట్ గా శోభా కూడా అవును నాక్కూడా అదే అనిపిస్తుంది అంటుంది, అప్పుడు నరసింహ తల్లి నాకు కూడా అదే అనిపిస్తుంది, దీని పని తర్వాత చెప్తాను అంటూ వెళ్ళిపోతారు. కార్తీక్, దీప లు కూడా వెళ్ళిపోతారు.
పార్వతి తో జ్యోత్స్న బావ కోసం నేను ఏది అయినా సాక్రిఫైస్ చెయ్యడానికి రెడీ ఉన్న గ్రానీ, కానీ బావ ఆలా లేదు అంటుంది. దీప తో మాట్లాడితే తన కూడా వచ్చిన నేను గుర్తుండన, తన కూడా వచ్చిన నన్ను పట్టించుకోడ, మరీ అంతలా పట్టించుకోకుండా ఎలా ఉంటాడు గ్రానీ అంటుంది, జాలి చూపించడానికి కూడా ఒక హద్దు ఉండాలి అంటుంది జ్యోత్స్న. అప్పుడు పార్వతి జాలి అయితే కదలకుండా కూడా చూపించొచ్చు మానవరాల, అదే భాద్యత అయితే ఎంత దూరం అయినా తీసుకెళ్తుంది అంటుంది, ఈ మాట గుర్తుపెట్టుకో అంటుంది, అయినా మీ బావ మొదట్నుంచి ఇలానే ఉండేవాడు కదా అంటుంది, అప్పుడు జ్యోత్స్న లేదు గ్రానీ ఈ మధ్య నే బావ నాతో ఇలా ఉంటున్నాడు అంటుంది, నా బర్త్డే కి జస్ట్ రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చాడు, అదే లాస్ట్ ఇయర్ అయితే డైమండ్ నాసైక్లాస్ తీసుకొచ్చాడు, అది నేను యెప్పటికీ ఎంత జాగ్రత్త గా పెట్టుకున్నానో చూడు అంటూ వెతుకుతుంది, కానీ ఆ నెక్లెస్ కనిపించదు, పార్వతి ఏం అయింది అని అడుగుతుంది, అప్పుడు నాలుగు రోజుల క్రితమే నేను బావ కి చూపించాను గ్రానీ ఇప్పుడు అది కనిపించడం లేదు అంటుంది. అప్పుడు పార్వతి నవ్వుతుంది, నాకెలాస్ కనిపించడం లేదు అంటే నవ్వుతున్నావ్ ఏంటి గ్రానీ అంటుంది, అప్పుడు పార్వతి ఆ నవ్వకుండా ఏం చేయమంటావ్, బావ కి చూపించాను అన్నావ్ కదా మరీ అది ఇక్కడ ఎందుకు ఉంటుంది, చేరాల్సిన చోటకే చేరి ఉంటుంది,ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యాలి అంటూ జ్యోత్స్న ని తీసుకెళ్లి ఏవో చెప్తుంది. ఈ లోగ దీప కార్తీక్ లో ఇంటికి వస్తారు,జ్యోత్స్న సుమిత్ర తో మమ్మీ బావ ఇచ్చిన నెక్లెస్ కనిపించడం లేదు అంటుంది, అప్పుడు తన తండ్రి ఇంట్లో పెట్టిఇంది ఎక్కడికి పోతుంది అంటాడు, అప్పుడు పార్వతి ఇంట్లో వాళ్ళు ఇంట్లో తిరిగితే ఎక్కడి వస్తువులు అక్కడే ఉంటాయి, బయట వాళ్ళు ఇంట్లో తిరిగితే ఇంట్లో వస్తువు బయటకు వెళ్తుంది అంటుంది. అప్పుడు సుమిత్ర బయట వాళ్ళు ఎవరు అత్తయ్య అంటుంది, ఈ లోగ దీప కార్తీక్ లు వస్తారు. దీప సూర్య ని పిలుస్తుంది, అప్పుడు పార్వతి బయట వాళ్ళు ఎవరో ఇప్పుడు మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట అంటుంది, అప్పుడు సుమిత్ర అంటే దీప ఆ నెక్లెస్ తీసన్దనే కదా మీ ఉద్దేశం అంటుంది. అప్పుడు పార్వతి అంతే కదా అంటుంది, అప్పుడు కార్తీక ఏం అత్తఅని అడుగుతాడు, అప్పుడు సుమిత్ర నువ్ ఇచ్చిన నెక్లెస్ కనిపించడం లేదు అంట అంటుంది, అప్పుడు పార్వతి కనిపించక పోవడం కాదు, కనిపించకుండా చేసారు అని చెప్పు అంటుంది , ఇదొక వంకతో అన్ని గదులు తిరుగుతున్నారు కదా, విలువైనది కనిపించి నప్పుడు ఎవరికీ మాత్రం ఆశ పుట్టదు అంటుంది, ముందు ఆ తీసిన వస్తువు ఎక్కడ పెట్టిందో చెప్పమనండి అంటుంది. అప్పుడు సుమిత్ర, అత్తయ్య ఎవరు ఎలాంటి వాళ్ళో ముందు తెసులుకుని మాట్లాడండి అంటుంది, అప్పుడు పార్వతి మనుషులు మంచి వల్లే, కానీ బుద్ధులే పరిస్థితికి అనుకూలం గా మారుతుంటాయి అంటుంది, అవుట్ హౌస్ కి వెళ్లి అంతా వెతికించండి అంటుంది, వస్తువు లేదు అంటే దీప దొంగతనం చెయ్యనట్టే కదా అంటుంది, నేను ఎంత మాట్లాడుతున్న నోరు విప్పడం లేదు అంటేనే అర్ధం అవుతుంది, నా అనుమానమే నిజం అని అంటుంది. అప్పుడు సుమిత్ర అత్తయ్య దీప మౌనం గా ఉంది సమాధానం చెప్పడం చేత కాకా కాదు మన మీద ఉన్న గౌరవం తో అంటుంది, అప్పుడు జ్యోత్స్న కూడా గ్రానీ అన్నదానంలో తప్పేం ఉంది మమ్మీ అంటుంది, అప్పుడు కార్తీక్ జ్యోత్స్న, పారుకి తెలియకపోవచ్చు కానీ దీప ఎలాంటిదో నీకు తెల్సు కదా అంటాడు, నిండా వేలాంటి వాళ్ళ మీద వేస్తున్నామో తెల్సుకుని వెయ్యాలి, అది పద్ధతి సంస్కారం కూడా ముందు అదే నేర్చుకో అంటాడు జ్యోత్స్న ని. అప్పుడు జ్యోత్స్న నీ సంస్కారం ఇందాక టీ కొట్టిదగ్గరే అర్ధం అయింది బావ, ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు ముందు మనం నేర్చుకోవాలి అంటుంది కార్తీక్ ని.