శ్రీధర్ రెండో భార్య కి వ్రతానికి రావద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ…
కార్తీకదీపం సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఎం జరిగిందో చూద్దాం, నిన్నటి ఎపిసోడ్ లో శ్రీధర్ ని కాంచన కార్తీక్ అనసూయ లు వ్రతానికి పిలవడానికి వెళ్తారు, అప్పుడు శ్రీధర్ నేను రాకపోతే అంటే అప్పుడు కాంచన గట్టిగ కార్తీక్ తండ్రి గా మీరు వస్తారు అని చెప్పి బయల్దేరుతారు, అప్పుడు అనసూయ మీరు వెళ్ళండి అమ్మ నేను ఒక మాట చెప్పి వస్తాను అని వాళ్ళని పంపించేసి శ్రీధర్ రెండో భార్య తో చూడమ్మా ఈయన తో మీరు వ్రతానికి వాహకారనుకో చెడుతిరుగుళ్లు తిరిగే ఆడదాన్ని సమాజం చాల చులకనగా చూస్తుంది, మగాడికి కి ఎప్పుడు విలువ లేదు వస్తే పోయేది నీ పరువే ఒక ఆడదానిగా రాకపోవడమే మంచిది అని నా అభిప్రాయం, అని చెప్పి వెళ్ళిపోతుంది అనసూయ. ఆ మాటలు విన్న శ్రీధర్ రెండో భార్య ఎవరండీ ఇది ఇంత పద్దతిగా నాకు వార్నింగ్ ఇస్తుంది అంటుంది, అప్పుడు శ్రీధర్ దీప వాళ్ళ మేనత్త అంటాడు, అప్పుడు ఆమె మరి ముందే చెప్పొచ్చుగా, మీ కోడలికి రెండో పెళ్లి చేస్తే పోనీ పరువు మీ రెండో పెళ్ళాం మీ దగ్గర నిలబడితే పోతుందా అంటుంది, అప్పుడు శ్రీధర్ ఆవిడా నీకంటే కంచు ఆవిడా నోట్లో నోరు పెట్టకు బతుకు మీదే విరక్తి పుడుతుంది అంటాడు, అప్పుడు ఆమె దాని పని దొరికినప్పుడు చెప్తాలే గాని మీరు ముందు వ్రతానికి వెళ్తారా అంటుంది, అప్పుడు శ్రీధర్ కార్తీక్ తండ్రి గా మీరు వస్తారు అంటే అర్ధం ఏంటో తెల్సా వెళ్లకపోతే నేను తన తండ్రి కాదని అంటాడు, నేను వెళ్తాను అంటాడు.
తాను పెట్టిన సరతుకి కాంచన ఒప్పుకోదని, ఈ వ్రతం జరగదని ఊహల్లో ఉన్న దీప….
దీప వంటగదిలో వంట చేస్కుంటూ నేను చెప్పిన సరతుకి మీరు భాద పడతారని నాకు తెల్సు అమ్మ, కానీ తప్పడం లేదు మీరు మీ ఆత్మభిమానాన్ని చంపుకుని ఆయన్ని పిలవలేరు అప్పుడు ఈ వ్రతం జరగదు ఇక మీరు గాని మా అత్తయ్య గాని నన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేరు ఇంకా ఈ తాళి ఎం అవుతుందో అనుకుంటూ ఉండగా సౌర్య కొత్త బట్టలు వేసుకుని అమ్మ అంటూ దీప దగ్గరకి వస్తుంది, అప్పుడు దీప నీకు ఈ కొత్త బట్టలు ఎక్కడివి అంటుంది, అప్పుడు సౌర్య నాకు నానమ్మ కొని ఇచ్చింది అంటుంది, అప్పుడు దీప కొంటె ఒక్కటి కొనివ్వాలి కానీ ఇన్ని కొంటారా, అయినా నా దగ్గరకి ఎందుకు తీస్కోచ్చావ్ అంటుంది దీప,రేపు మనం వ్రతానికి వెళ్తున్నాం అంట కదా ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పు అంటుంది సౌర్య, అప్పుడు దీప వ్రతం ఏమి జరగదు నువ్వు వేళ్ళు అంటుంది దీప.
దీప తండ్రి కోసం కాసి తండ్రి వెతుకులాట……………
కాసి తండ్రి వెతుకుతున్న ఫోటో ని పట్టుకుని నువ్వు ఎక్కడున్నావో తెలీదు, ఆ రోజు నీకు ఇచ్చిన పాప అనాధ కాదు కాయతీశ్వరాలు వారసురాలు, పోనీ ఈ ఫోటో పేపర్ లో వేద్దామంటే మా అమ్మ పారిజాతం నిన్ను కూడా చంపేస్తుంది, మా అమ్మ ఆస్థి కోసం ఇంకీన్ని నేరాలు చేస్తుందో భయం వేస్తుంది, నిన్ను ప్రమాదం లో పెట్టడం నాకు ఇష్టం లేదు అలాగని నిన్ను వదిలి పెట్టాను ఏదొకలా నిన్ను పట్టుకుంటే,నా కొడుకు జీవితం బాగుండాలి అంటే నిజం చెప్పి నా పాపాలను పోగొట్టుకోవాలి అనుకుంటూ ఉంటాడు.
దీప కి కాంచన ఇచ్చిన షాక్….
దీప అత్తయ్య అంటూ పిలుస్తుంది కానీ ఎవరు పలికారు అప్పుడు సౌర్య వాళ్లంతా బయటకు వెళ్లారు అమ్మ అంటుంది, అప్పుడు దీప వీళ్లంతా ఎక్కడికి వెళ్ళుంటారు అనుకుంటుండగా ఈలోగా కాంచన వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు, అనసూయ ని ఎక్కడికి వెళ్లారు అత్తయ్య అంటుంది, అప్పుడు అనసూయ నీ కోరిక తీర్చడానికే అంటుంది, అప్పుడు కాంచన రేపు ఉదయం గుడిలో నీకు కార్తీక్ కి సత్యన్నారాయణ స్వామి వ్రతాహం చేసిస్తున్నాను, మీ దంపతులని దీవించడానికి మా దంపతులం వస్తాము అంటుంది, అప్పుడు అనసూయ ఏంటి నమ్మబుద్ది కావట్లేదా, నీ కోసం ఆవిడా ఆత్మభిమానాన్ని కూడా పక్కన పెట్టి మీ మావయ్యగారిని వ్రతానికి పిలిచింది అయన వస్తారు వ్రతం జరుగుతుంది అంటుంది దీప తో , అప్పుడు కాంచన అనసూయ నా కోడలు కోరుకున్న దాని ప్రకారం నేను తీర్చాను ఇంకా తాను నిలబెట్టుకోవడం లో ఉంది అంటుంది, అప్పుడు అనసూయ ఇంకా నిలబెట్టుకోడానికి ఎం ఉంది అమ్మ మీ ఏర్పాట్లలో మీరు ఉండండి వచ్చి పీతల మీద కూర్చుంటుంది అంటుంది.
దీప నాకు వ్రతం లో కూర్చోవడం అవమానం గా ఉంటుందని అనసూయని పట్టుకుని బాధపడుతుంది…..
దీప వంటరిగా ఆలోచిస్తూ ఉండగా అనసూయ వచ్చి దీప ఇక్కడేం చేస్తున్నావ్ రా భోజనం చేద్దాం అంటుంది, అప్పుడు అనసూయ తప్పుచేసాడని భర్తనే వదిలేసిన మనిషి కొడుకు కోసం మల్లి అతని దగ్గరకి వెళ్లిందంటే కొడుకు కోసం ఆమె ఏం చెయ్యడానికి అయినా సిద్ధం అని నీకు ఇంకా అర్ధం కావడం లేదా అసలు నువ్వు ఎవరు నీ కోసం ఇదంతా ఏండుకుకే చేయాలి కార్తీక్ బాబు గారు లాంటి మనిషి నీ మేడలో ఎందుకు తాళి కట్టాలి, అసలు కార్తీక్ బాబు కి నీ బిడ్డకి ఏంయి సంబంధం, కాంచనగారికి నీ బిడ్డకి ఏంటి సంబంధం ఏ సంబంధం లేని వల్లే పసిదాన్ని గురుంచి అలోచించి బంధం కలుపుకుంటే నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటావేంటీ అంటుంది దీప ని, అప్పుడు దీప మనం బాగుంటే చాలా, మనకి మంచి జరిగితే చాలా, మనల్ని నమ్ముకున్నవాళ్ళు మనకి సాయం చేసిన వాళ్ళు ఏం అయిపోయిన పర్లేదా అంటుంది దీప, అప్పుడు అనసూయ ఏ ఇద్దరు కాలవలో ఎవరు జంట కావాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు, ఆ సుమిత్రమ్మ కూతురికి కార్తీక్ బాబు కి కలిసే రాత లేదు ఆ రథ ఉంటె నిశ్చితార్థం పెళ్లి కూడా ఆగేది కాదు, నీ బుర్ర పెట్టి ఆలోచిస్తే నువ్వు పూజించవలసింది దేవుడిని కాదు కార్తీక్ బాబూ ని, నరసింహ నిన్ను చంపుతుంటే వచ్చి కాపాడాడు, నీ మేడలో తాళి కట్టి నీ జీవితాన్నే కాపాడాడు ఎక్కడ దొరుకుతారు ఇలాంటి మంచివాళ్ళు నీ బిడ్డ అదృష్టం కొద్దీ దొరికారు, కాంచన గారికి తన కొడుకు సంతోషంగా ఉండాలనే తప్ప వేరే ఏ ఆశలు లేవు దాని కోసం నువ్వేం చెయ్యాల్సిన అవసరం లేదు, ఒక పద్ధతి గల భార్య భర్తతో ఎలా ఉండాలో ఆలా ఉండు చాలు, ఆడదానికి పెళ్లి తర్వాత ఇంటి పేరు మారుతుంది నీకు నీ తలరాత కూడా మారింది అనుకో, నువ్వు నీ గుండెల మీద చేయి వేసుకుని నువ్వు ఏమైనా తప్పు చేసావా అని అడగవే, కార్తీక్ బాబు కి సుమిత్రమ్మ గారి అమ్మాయి ఇష్టం ఉంటె ఆ అమ్మాయి నే పెళ్లాడేవాడు కాదెయ్, నువ్వంటే పరాయి దానివి వాళ్లంతా బంధువులే, ఏ ఆలోచన లేకుండానే నీ మేడలో తాళి కట్టాడా, చంటి దాని కోసమే కదా ఇదంతా చేశారు, ఎంత చంటిదాని కోసం అయినా నువ్వు చెడ్డదానివి అయితే నీ మేడలో తాళి ఎందుకు కడతాడు కార్తీక్ బాబు పక్కన భార్య నిలబడే అర్హతలు నీకు ఉన్నాయ్, నీ మంచితనం నిజాయిహి తనమే ఆలా నిలబడ్డాయి, మీ అత్తయ్యగారు ఆవిడా మాట నిబెట్టుకుంది నువ్వు కూడా నీ మాట నిలబెట్టుకో అంటుంది, అప్పుడు దీప అనసూయని పట్టుకుని ఏడుస్తూ కార్తీక్ బాబూ భార్య గ పక్కన కూచుని వ్రతం చేస్కునే దైర్యం నాకు లేదు అత్తయ్య ఎదో తప్పు చేస్తున్న అని నా మనసు అంత పీకుతోంది అంటుంది, అప్పుడు అనసూయ నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకు నీకు ఇలా బయంవేయ్యడం మాములే ఒక్కసారి అవన్నీ పక్కన పెట్టి ధైర్యం గా ఉండు అన్ని నీకే అర్ధం అవితై అవన్నీ పక్కన పెట్టి నీ బిడ్డ భవిష్యత్తు గురుంచి ఆలోచించు అంటూ దీప ని లోపలి తీసుకెళ్తుంది అనసూయ.
దీప కార్తీక్ ల సత్యన్నారన వ్రతం గురుంచి తెల్సుకున్న పారిజాతం….
కాసి తండ్రి కి ఫోన్ వస్తుంది పారిజాతం ఫోన్ చేసి నిన్ను కలవాలి అంటుంది, అప్పుడు ఈ రోజు కుదరదు అమ్మ అంటుండగా స్వప్న వచ్చి మావయ్యగారు వ్రతానికి వెళ్దాం పదండి అంటుంది, అది విని పారిజాతం వ్రతానికి వెళ్తున్నారా, నీ కొడుక్కి కోడలికి సత్యన్నారాయణ స్వామి వ్రతం చేయిస్తూ నన్ను పిలవాలని కూడా అనిపించలేదా అంటుంది, అప్పుడు అతను వ్రతం దీప కార్తీక్ వాళ్లకు అని చెప్తే తిడుతుందని స్వప్న వాళ్ళ ఫ్రెండ్ కి అని చెప్తాడు అప్పుడు కాసి అదేంటి నాన్న నువ్వు ఎప్పుడు నిజమే చెప్తావ్ కదా ఫోన్ ఇలా ఇవ్వండి నేను చెప్తా అంటూ ఫోన్ లాక్కుని హలో పారిజాతం గారు అంటాడు అప్పుడు పారిజాతం ఎంట్రోయ్ పేరు పెట్టి పిలుస్తున్నావ్ అంటుంది, అప్పుడు కారి నానమ్మ అంటే ఎవర్రా నీకు నానమ్మ అన్నావ్ కదా అందుకే పేరు పెట్టి పిలుస్తున్నాను అంటాడు, వ్రతం దీప అక్క కార్తీక్ బావ కి మమ్మల్ని రమ్మని పిలిచారు వెళ్తున్నాం అంటాడు, అప్పుడు పారిజాతం ఎంతకు తెగించారు రా, అది చేస్కుండి పనికిమాలిన పెళ్లి మల్లి వ్రతం కూడానా అంటుంది, అప్పుడు కాసి నువ్వు ఇంకా మారవు నానమ్మ అంటూ ఫోన్ పెట్టేస్తాడు.
కార్తీక్ వ్రతానికి రెడీ అవుతూ ఉండగా దీప కార్తీక్ దగ్గరకి వచ్చి పిలుస్తుంది, రా దీప గుడికి వెళ్ళలిగా ఇంకా రెడీ అవ్వలేదు అంటాడు, అప్పుడు దీప మీరు నాకు శ్రేయోభిలాషి అని పిలిచేవారు కదా అది నిజమేనా అంటుంది, అప్పుడు కార్తీక్ నిజం అని నిరూపించడానికి స్టాంప్ పేపర్ మీద ఱసి ఇవ్వాళా అంటాడు, అప్పుడు దీప సాయం చేస్తే చాలు అంటుంది, వ్రతం లో పీటల మీద కొత్తపెళ్ళికూతుగా మీ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు బాబు అంటుంది దీప.