గుప్పెడంత మనసు Today Episode (03-05-24)

గుప్పెడంత మనసు ఈ రోజు ఎపిసోడ్ చూద్దాం. అనుపమ వసుధారల తో మాట్లాడిన మాటలకూ అనుపమ దేవయానికి వార్నింగ్ ఇచ్చి వేల్లోపోమంటుతుంది, అప్పుడు దేవయానికి తన ఇంటికి వచ్చే సరికి ఫణేంద్ర కోపం గా ఉండటం చూసి దేవయాని ఎం అయిందండి ఆలా ఉన్నారు అంటుంది, నువ్వెక్కడికి వెళ్ళావ్ అంటాడు ఫణేంద్ర, పని మీద వెళ్ళాను అంటుంది దేవయాని, అప్పుడు ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికే కదా నువ్వు వెళ్ళింది అంటాడు ఫణేంద్ర, అప్పుడు లేదు అంది నేనేం చెయ్యలేదు అంటుంది దేవయాని, అప్పుడు ఫణేంద్ర వసుధారా దేవయాని మాట్లాడిన మాటలు రికార్డింగ్ చేసి పంపిన వీడియో చూపిస్తాడు ఫణేంద్ర దేవయానికి, అసలు నువ్వే ఈ ఇంటి పరువు తీస్తున్నావ్, ఎదుటి వారి సిట్యుయేషన్ బట్టి మాట్లాడాలి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తున్నావా అంటూ ఫణేంద్ర దేవయాని తో అంటాడు, అప్పుడు దేవయాని అయినా ఇప్పుడు నేనేం తప్పు చేశాను అంటుంది, ఎందుకలా కోప్పడుతున్నారు చెప్పు శైలేంద్ర నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా అంటుంది దేవయాని, అప్పుడు ఫణేంద్ర శైలేంద్ర ని చెంప ఫై కొడతాడు, తప్ప తప్పున్నర అసలు నువ్వు వాళ్ల ఇంటికి వెళ్లడమే పెద్ద తప్పు అంటాడు ఫణేంద్ర, అప్పుడు శైలేంద్ర అసలు నేనేం చేశాను డాడీ నన్నెందుకు కొట్టారు అంటాడు శైలేంద్ర, అప్పుడు ఫణేంద్ర మీ అమ్మ ని కొట్టలేను కాబట్టి, ఆడవాళ్ళ మీద చెయ్యి చేస్కోవడం నాకు తెలీదు కాబట్టి దేవయాని అర్ధం అయిందా ఈ దెబ్బ ఎవరి మీద పడిందో, అసలు ఏంట్రా మీరు, మీ అమ్మ ఏం తప్పులు చేసిన నువ్వు కరెక్ట్ అంటావ్, నువ్వేం తప్పులు చేసిన మీ అమ్మ కరెక్ట్ అంటుంది, అసలు మీకు ఏం తెలీక పోయిన ఎదుటి వాళ్ళు చెప్తే అయినా అర్ధం చేస్కునే జ్ఞానం లేదా మీకు, అంటు తల్లి కొడుకులని తిడుతుంటాడు. దేవయాని ఇవన్నీ నీకెందుకు , హాయిగా ఇంట్లో కూర్చుని టీవీ చుస్కుంటు, లేదా పురాణాలూ చదువుకుంటు టైం కి తిని ఉండక ఈ కాలేజ్ విషయాలు అన్ని నీకెందుకు అంటూ నీకు నీ కొడుక్కి ఇదే లాస్ట్ వార్నింగ్ అంటాడు ఫణేంద్ర.

                                                        పోలీస్ స్టేషన్ దగ్గర వసుదారా, మహేంద్ర లు బయట కూర్చుని ఉండగా టీ తీస్కుని రాజీవ్ స్టెయిన్ కి వెళ్లి అందరికి ఇస్తాడు, మనూ కి కూడా ఇస్తాడు అప్పుడు మనూ రాజీవ్ పేస్ చూడడు వద్దు అంటాడు, అప్పుడు రాజీవ్ తీస్కోండి బయ్యా బాగుంటది అంటాడు అప్పుడు మనూ రాజీవ్ ముఖాన్ని చూస్తాడు, అప్పుడు రాజీవ్ ఏంటి బయ్యా అంత బాగా కంఫర్ట్ గా ఉందా అంటాడు మనూ ని, అప్పుడు  మనూ రాజీవ్ అంటూ పిలుస్తుండగా రాజీవ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు, అప్పుడు పోలీస్ లు మహేంద్ర వసుధారా వాళ్ళు మనూ సెల్ దగ్గరకు వస్తారు ఏం అయింది అని అడగగా, రాజీవ్ టీ తీస్కుని వచ్చాడు నేను చూసాను అంటాడు, అప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నారు , చచ్చిపోయిన రాజీవ్ ఇక్కడికెలా వస్తాడు , అయినా ఎప్పుడు తీస్కొచ్చే అతనే టీ తీసుకొచ్చాడు, అని కానిస్టేబుల్ ని పిలిచి టీ ఎవరు తీసుకొచ్చారు అంటాడు, అప్పుడు ఆ కానిస్టేబుల్ ఎప్పుడు తీసుకొచ్చే అతనే టీ తీసుకొచ్చాడు సర్ అంటాడు, అప్పుడు మనూ కాదు నేను చూసాను రాజీవ్ ని నన్ను చూసి ఎటకారం గా నవ్వాడు అంటాడు మనూ, అప్పుడు కానిస్టేబుల్ ని టీ అతన్ని పిలవమని  పంపిస్తాడు పోలీస్ ఆఫీసర్, అప్పుడు పోలీస్ ఆఫీసర్ మీరు ఈ తప్పు చెయ్యలేదని నిరూపించాలని ఇలా అబద్దాలు ఆడుతున్నారా, సాక్షాలు తో సహా అన్ని ఉన్నాయ్ మీరే ఈ హత్యా చేసారని అయినా అబద్దాలు ఆడుతున్నారు అంటాడు పోలీస్ ఆఫీసర్, వసుధారా తో మీరు కాలేజ్ md  తో పటు లెక్చరర్ అని కూడా విన్నాను మీరైనా అతనికి చెప్పండి నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుందని , లేదంటే ఎంత కఠినమైన శిక్ష అయినా పడొచ్చు, మీరే అతనికి క్లియర్ గా అర్ధం అయ్యేలా చెప్పండి అంటాడు పోలీస్ ఆఫీసర్. అప్పుడు వసుధారా మనూ గారు ఈ సాక్షాలు ఇవన్నీ పక్కన పెట్టండి, నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఈ నేరం చేసారా, రాజీవ్ ని మీరు చంపారా అని అడుగుతుంది వసుధారా. అప్పుడు మనూ నేను రాజీవ్ ని చూసాను మేడం అంటాడు వసుధారా తో, అప్పుడు వసుధారా చూసారా అని కాదు మీరు ఈ నేరం చేసారా అని అడుగుతున్న అంటుంది వసుధారా. అప్పుడు మనూ నేను రాజీవ్ ని చూసాను అంటే అతను బ్రతికే ఉన్నాడని కదా అర్ధం అంటే నేను ఈ హత్యా చెయ్యలేదని కదా దానికి అర్ధం అంటాడు మనూ. అప్పుడు వసుధారా మనూ ని, ఒకసారి బాగా ఆలోచించండి శిక్ష తగ్గిస్తా అంటున్నారు కదా అంటుంది వసుధారా. అప్పుడు మనూ , శిక్ష తగ్గడం ఏంటి మేడం  అసలు నాకు శిక్షే ఉండదు అంటాడు మనూ, కానీ నేను నేరం చెయ్యలేదని ప్రూవ్ అవ్వాలి అంటాడు మనూ. అప్పుడు మహేంద్ర వసుధారా నువ్వుకూడా వాళ్ళేదో అన్నారని గుచ్చి గుచ్చి అడుగుతున్నావు, మనూ నువ్వేం ఇవేం పట్టించుకోను నువ్ తప్పు చూడని నాకు తెల్సు, ఎవరు ఏం ఆశలు చూపించిన వాటికీ నువ్ లొంగొద్దు, నువ్ నిర్దోషివి అని తేలే వరకు ఇలానే ఉండు అంటాడు మహేంద్ర. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి సర్ ఇలా చెప్తున్నారు అనగా, అప్పుడు మహేంద్ర మనూ ని నువ్వేం బయపడకు నిన్ను బయటకు తీసుకొచ్చే బాధ్యత నది అంటాడు మహేంద్ర. ఈ లోగ కానిస్టేబుల్ టీ తీసుకొచ్చిన అతన్ని తీసుకొస్తాడు, అప్పుడు అతనికి మనూ ని చూపించి ఆయనికి టీ ఇచ్చింది నువ్వేనా అంటాడు, అప్పుడు ఆ టీ అతను నేనే అంటాడు, అప్పుడు మనూ కాదు నాకు టీ ఇచ్చింది రాజీవ్ అంటాడు, అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మీరు శిక్ష నుంచి తప్పించుకోడానికి అబద్దాలు ఆడుతున్నారు అంటాడు పోలీస్ ఆఫీసర్.

               వసుధారా , మహేంద్ర లు ఇదంతా శైలేంద్ర నే చేసుంటాడు , బయట వాళ్ళు  మనకి ఇలా చేసే అవకాశమే లేదు అనుకుంటారు, అప్పుడు వసుధారా అవును మావయ్య నావి మనూ గరివి ఫోటో లు కాలేజ్ లో అత్తించడం శైలేంద్ర ఒక్కడివల్ల కాదు కచ్చితంగా రాజీవ్ హెల్ప్ చేసుంటాడు, అప్పుడే నాకు అనుమానం వచ్చింది, మావ చాల దుర్మార్గుడు, అంత తీలిగ్గా చచిపోయే రకం కాదు, మొన్న నేను నిద్ర పోతున్నప్పుడు న మీద నీడ పడింది అని చెప్పను గుర్తుందా మావయ్య, అంతే కాదు పోలీస్ స్టేషన్ దగ్గర నాకు కనిపించి కనిపించనట్టుగా అనిపించింది, మనూ గారు కూడా రాజీవ్ ని చూసాను అంటున్నారు కదా మావయ్య, కచ్చితంగా రాజీవ్ బ్రతికే ఉన్నాడు, శైలేంద్ర రాజీవ్ లు కలిసి ఈ నాటకం ఆడుతున్నారు అంటుంది వసుదారా.

Scroll to Top