తెలంగాణ తల్లి కొత్త విగ్రహానికి డేట్ ఖరారు…..Statue Of Telangana Thalli..

తెలంగాణ రాష్ట్ర ముసఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ తల్లి విగ్రహం ఈ నెల 29 న ఆవిష్కరించ నున్నారు. అయితే తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసన సభలో ప్రకటించారు, ఇప్పటివరకు ప్రాచుర్యంలో ఉన్న విగ్రహానికి అధికారిక గుర్తింపు లేదని స్పష్టం తెలియజేసారు, అసెంబ్లీ వేదికగా తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకతలను సభకు వివరించిన సీఎం స్వరాష్ట్ర సాధన సుదీర్ఘ పోరాటంలో సకల జనుల్లో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లిని అధికారికంగా గౌరవించుకుంటున్నామని తెలియజేసారు.

తెలంగాణ భావోద్వేగాన్ని ప్రతిబింబించేలా ప్రజా ప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపొందించిందని తెలిపారు. ప్రశాంత వదనంతో నిండైన రూపంతో చాకలి ఐలమ్మ, సమ్మక్క సరళమ్మ పోరాట స్ఫూర్తి కనిపించేలా హుందాతో కనిపించేలా విగ్రహం రూపొందించినట్టు చెప్తున్నారు, తెలంగాణ అస్తిత్వాన్ని తెలిపేలా చేతిలో తెలంగాణ పంటలతో కనిపిస్తుందన్నారు, తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం చరిత్రకు దర్పణంగా నిలుస్తుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. విగ్రహంలో వాడిన ఒక్కో రంగు ప్రత్యేకతను చెప్పిన సీఎం రేవంత్, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ సంక్షిప్త పేరును టీజీ కి అధికారిక గుర్తింపు ఇచ్చామని తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసిన జనని జయ జయహేను రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించామని సీఎం స్పష్టం చేశారు.

Scroll to Top